బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు
ABN , First Publish Date - 2021-11-29T05:19:32+05:30 IST
బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు

ఏకశిలనగర్ (వరంగల్), నవంబరు 28: వరంగల్ తూర్పు నియోజక వర్గంలోని ఓ గురుకుల పాఠశాలలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో చట్టం కింద మిల్స్‌కాలనీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాస్, బాలిక తల్లిదండ్రుల కథనం ప్ర కారం. వరంగల్ నగరంలో ఓ పత్రికా విలేకరిగా చలా మణి అవుతున్న వ్యక్తి మధ్యాహ్న వేళ గురుకుల పాఠ శాలలోకి ప్రవేశించారు. అక్కడి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బా లికపై అసభ్యంగా ప్రవర్తించిన సదరు విలేకరిపై బాలి క తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.