రంగశాయిపేటలో క్షుద్ర పూజల కలకలం

ABN , First Publish Date - 2021-11-06T05:12:32+05:30 IST

రంగశాయిపేటలో క్షుద్ర పూజల కలకలం

రంగశాయిపేటలో  క్షుద్ర పూజల కలకలం

 శంభునిపేట, నవంబరు 5 : సాంకేతిక యుగంలోనూ మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. క్షుద్రపూజలతో ప్రజ ల్లో భయాందోళనలకు గురి చేసిన ఘటన నగరంలో జరిగింది. రంగశాయిపేటకు చెందిన ఓ కుటుంబం కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. గురువారం నర్సంపేట మండలం మొగ్దుంపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఇంటికి పిలిచి పూజలు చేశారు. గమనించిన ఇరుగుపొరుగు వారు క్షుద్ర పూజలు చేస్తున్నారని సదరు ఇంటిపై దాడిచేసి, పూజా సామగ్రిని ధ్వంసం చేశారు. తమ ఇంటిపై ఇరుగుపొరువారు దాడిచేశారంటూ ఆ కుటుంబం మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-11-06T05:12:32+05:30 IST