డాక్టర్‌ రామక లక్ష్మణమూర్తికి ఘన నివాళి

ABN , First Publish Date - 2021-01-21T04:02:59+05:30 IST

డాక్టర్‌ రామక లక్ష్మణమూర్తికి ఘన నివాళి

డాక్టర్‌ రామక లక్ష్మణమూర్తికి ఘన నివాళి

హన్మకొండ అర్బన్‌, జనవరి 20: సీనియర్‌ వైద్యుడు రామక లక్ష్మణమూర్తి స్మృత్యాంజలి సభను బుధవారం సహృదయ- భారత భారతి సంస్థ ఆధ్వర్యంలో వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. కుంఝూవజ్జుల కృష్ణమూర్తి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌ లక్ష్మణమూర్తికి పలువురు ఘనంగా నివాళులర్పించారు. లక్ష్మణమూర్తి ఆధ్యాత్మిక వైద్యుడని, స్వయంగా నారాయణుడని, వైద్యుడుగానే కాకుండా మానవతావాది అని అన్నారు. ఈ తరం వైద్యులు ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలని తెలిపారు. లక్ష్మణమూర్తి విద్యార్థులు, అమెరికన్‌ డాక్టర్‌ పెన్సిల్వేనియా నుంచి డాక్టర్‌ పారేపల్లి హరినాథ్‌ మాట్లాడుతూ.. వైద్యం, సాహిత్యం, ఆధ్యాత్మికత, సంగీతం కలబోసిన మహామనిషి లక్ష్మణమూర్తి అని అన్నారు. మూడు దశాబ్దాలకు పైగా వైద్య రంగంలో సేవలందించిన లక్ష్మణమూర్తి హోమియో, అలోపతి, యునాని, ఆయుర్వేదంలో నిష్ణాతులని, అన్ని వైద్యాలను సమాన స్థాయిలో గౌరవించేవారన్నారు. సమావేశంలో ప్రముఖ ప్రవచనకర్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, మైలవరకు శ్రీనివాసరావు, ఆల్‌ఇండియా రేడియో సంచాలకుడు ఆర్‌.వెంకటేశ్వర్లు, దూరదర్శన్‌ సంచాలకుడు పాలకురి మధుసూదన్‌రావు, ఎల్‌ఐసీ సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌ పి.మల్లికార్జునరావు, ప్రొఫెసర్‌ లక్ష్మణమూర్తి, ప్రొఫెసర్‌ సుప్రసన్న, ప్రొఫెసర్‌ కిష్టయ్య, దాట్ల హనుమంతరావు, సాహితీవేత్త రామశాస్త్రి, డాక్టర్‌ భక్తవత్సలరెడ్డి, వద్దిరాజు వెంకటేశ్వరరావు, దక్షిణమూర్తి, రమాదేవి, వై.సుదర్శన్‌రావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-21T04:02:59+05:30 IST