తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిది దొంగ ఓటే: రామ్మోహన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-03-22T19:51:03+05:30 IST

వికారాబాద్: తాండూర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసినప్పటికీ దొంగ ఓట్ల వ్యవహారం మాత్రం ఇంకా చల్లారలేదు.

తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిది దొంగ ఓటే: రామ్మోహన్‌రెడ్డి

వికారాబాద్: తాండూర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసినప్పటికీ దొంగ ఓట్ల వ్యవహారం మాత్రం ఇంకా చల్లారలేదు. నేడు కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న వ్యవహారంలో దుమారం రేగుతుండగానే తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా దొంగ ఓటు వేశాడని ఆరోపించారు. అమెరికాలో పైలెట్ శిక్షణ పొందిన రోహిత్ రెడ్డి... మన దేశంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ అర్హత లేని చదువుతో ఓటు వేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిది కూడా దొంగ ఓటేనన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు శాసనసభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. దొంగ ఓట్లు వేసిన తాండుర్ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలను బర్తరఫ్ చేయాలని రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.


Updated Date - 2021-03-22T19:51:03+05:30 IST