రాజీవ్‌గాంఽధీకి ఘన నివాళి

ABN , First Publish Date - 2021-08-21T05:09:53+05:30 IST

రాజీవ్‌గాంఽధీకి ఘన నివాళి

రాజీవ్‌గాంఽధీకి ఘన నివాళి
డీసీసీ భవన్‌లో రాజీవ్‌గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కాంగ్రెస్‌ నేతలు

డీసీసీ భవన్‌లో జయంతి వేడుకలు 


వరంగల్‌ సిటీ, ఆగస్టు 20 : దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం హనుమకొండలోని కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజీవ్‌ చిత్రపటానికి రాజేందర్‌రెడ్డి, మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంజీఎం సెంటర్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. పలుచోట్ల పండ్లు పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రజల హృదయాల్లో రాజీవ్‌గాంధీ చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ప్రధానమంత్రిగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, మీసాల ప్రకాశ్‌, నమిండ్ల శ్రీనివాస్‌, డాక్టర్‌ పులి అనిల్‌కుమార్‌, మహ్మద్‌ అయూబ్‌, అశోక్‌రెడ్డి, కమలాకర్‌ రెడ్డి, బిన్ని లక్ష్మణ్‌, డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ, కొత్తపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-21T05:09:53+05:30 IST