21 వేలు దాటిన ఈటల రాజేందర్ మెజార్టీ

ABN , First Publish Date - 2021-11-02T23:34:34+05:30 IST

మలపూర్‌లో ఈటల రాజేందర్ భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. 20వ రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పటివరకూ ఈ రౌండ్‌లో ఈటల రాజేందర్ మూడు వేలకు..

21 వేలు దాటిన ఈటల రాజేందర్ మెజార్టీ

హుజూరాబాద్: కమలపూర్‌లో ఈటల రాజేందర్ భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు.  20వ రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పటివరకూ ఈ రౌండ్‌లో ఈటల రాజేందర్ మూడు వేలకు పైగా ఓట్లు సాధించారు. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ సాగుతోంది. 20వ రౌండ్‌లో ఈటల రాజేందర్ 1,474 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తంగా ఈటల రాజేందర్ 21, 015 ఓట్ల మెజార్టీతో ముందంజలో కొనసాగుతున్నారు. 


కాగా హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీజేపీ సంబరాలు చేసుకుంటుంది. హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం ఖాయం కావడంతో గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి.. సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఈటెల గెలుపును అడ్డుకోలేకపోయారన్నారు. 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఈ విజయం సంకేతమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు.


Updated Date - 2021-11-02T23:34:34+05:30 IST