తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-12-31T20:12:43+05:30 IST

తెలంగాణను అప్పుల రాష్ట్రంగా సీఎం కేసీఆర్‌ మార్చారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.రాజవర్ధన్‌రెడ్డి విమర్శించారు.

తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్‌

కేసముద్రం, డిసెంబరు 30: తెలంగాణను అప్పుల రాష్ట్రంగా సీఎం కేసీఆర్‌ మార్చారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.రాజవర్ధన్‌రెడ్డి  విమర్శించారు. కేసముద్రంలో రెండు రోజుల పాటు కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు మండలాల కార్యవర్గం, బూత్‌ కన్వీనర్లు, వివి ధ పద మోర్చా అధికారులకు జరిగే శిక్షణ శిబిరం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమంలో అనేక మంది యువకుల ఆత్మబలిదానాల పునాదులపై కేసీఆర్‌ కూర్చుని వారిని విస్మరించారని ఆరోపించారు. కార్యక్రమంలో స్వదేశీ జాగరణ మంచ్‌ రాష్ట్ర కార్యదర్శి సౌమిత్రి లక్ష్మణాచారి, జిల్లా అధ్యక్షుడు ఒద్దిరాజు రాంచందర్‌రావు, ప్రధాన కార్యదర్శి వల్లభు వెంకటేశ్వర్లు, చెల్పూరి వెంకన్న, ఎల్ది మల్లయ్య, వోలం శ్రీనివాస్‌, శశివర్ధన్‌రెడ్డి, గాంతి వెంకట్‌రెడ్డి, పుల్లారెడ్డి, పోలెపల్లి దేవిరెడ్డి, జమ్ముల గోపాల్‌రెడ్డి, తుమ్మ ప్రేమ్‌కుమార్‌, లెంకలపల్లి శ్రీనివాస్‌, గోవర్ధన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T20:12:43+05:30 IST