ఖాళీ సంచులు లేక రైతుల ఇక్కట్లు

ABN , First Publish Date - 2021-05-03T04:34:29+05:30 IST

ఖాళీ సంచులు లేక రైతుల ఇక్కట్లు

ఖాళీ సంచులు లేక రైతుల ఇక్కట్లు
ఖాళీ సంచుల కోసం లారీ వద్ద ఎదురు చూస్తున్న రైతులు

మడికొండ, మే 2: పంటలు కోసి కల్లాల్లో ఉంచామని, ఖాళీ సంచులు లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడిపికొండలో ఖాళీ సంచులు అందిస్తున్నారని తెలిసి రాంపేట, తరాపల్లి, కుమ్మరిగూడెం తదితర గ్రామాలకు చెందిన రైతులు అక్కడికి వెళ్ళగా దర్గా సొసైటీ కార్యదర్శి భూపాల్‌రెడ్డి కొద్దిమందికి మాత్రమే ఖాళీ సంచులు ఇచ్చి మిగతా వారికి సంచులు అందుబాటులో లేవని చెప్పడంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... పంటలు కోసి కల్లాల్లో ఉంచామని ఎప్పుడు అకాల వర్షం వస్తుందోననే భయంతో ఉన్నామని తెలిపారు. పంట పండించడం ఒక ఎత్తయితే ధాన్యం అమ్ముకోవడం మరో ఎత్తవుతోందని వాపోతున్నారు. వెంటనే ఖాళీ సంచులు అందజేసి రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. భూపాలల్‌రెడ్డిని వివరణ కోరగా మరో విడతలో రైతులందరికీ అందజేస్తామని ఎవరికీ ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.


Updated Date - 2021-05-03T04:34:29+05:30 IST