చిట్యాలలో వడగళ్ల వాన
ABN , First Publish Date - 2021-04-22T05:46:36+05:30 IST
చిట్యాలలో వడగళ్ల వాన
చిట్యాల, ఏప్రిల్ 21: భూపాలపల్లి జిల్లా చిట్యాలలో బుధవారం రాత్రి వడగళ్ల వాన కురిసింది. పలువురి ఇళ్ల రేకులు, పెంకులు పగిలిపోయి ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. అర్ధరాత్రి వరకు ఉరుముల, మొరుపులతో కూడిన రాళ్ల పడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందారు. చేతికొచ్చిన మొక్కజొన్న, వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎండు మిరప వరుగుకు పరదలు కప్పేందుకు రైతులు పరుగులు తీశారు.