రైల్వే విద్యాసంస్థల రికార్డుల అప్పగింత

ABN , First Publish Date - 2021-06-17T05:15:48+05:30 IST

రైల్వే విద్యాసంస్థల రికార్డుల అప్పగింత

రైల్వే విద్యాసంస్థల రికార్డుల అప్పగింత
రికార్డులు అప్పగిస్తున్న కె.భిక్షాలు

కాజీపేట, జూన్‌ 16 : కాజీపేటలోని రైల్వే విద్యాసంస్థల రికార్డులను జిల్లా విద్యాశాఖ అధికారులకు బుధవారం రైల్వే విద్యాసంస్థల ఇన్‌చార్జి కురుమంచి భిక్షాలు అందజేశారు. కాజీపేట లో రైల్వే తెలుగుమీడియం, మిక్స్‌డ్‌ హైస్కూల్‌ 1904 - 2017, విద్యాసంవత్సరం, విద్యార్థులకు సంబంధించిన రికార్డులను కాజీపేట ఎంఈవో ఇ.రామకిషన్‌ రాజుకు అప్పగించా రు. అలాగే రైల్వే ఇంటర్‌మీడియట్‌ కళాశాల 1992 - 2012 విద్యాసంవత్సరం విద్యార్థు ల రికార్డులను హసన్‌పర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ బి.సునీతకు అందజేశారు. ఈ సందర్భంగా భిక్షాలు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన రైల్వే విద్యాసంస్థలు అడ్మిషన్లు లేక మూతపడ్డాయని తెలిపారు. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యార్థుల రికార్డులను జిల్లా విద్యాశాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపా రు. రైల్వే విద్యాలయాల్లో ఇంటర్మీడియట్‌  చదువుకున్న విద్యార్థులు వారి సర్టిఫికెట్ల కోసం హసన్‌పర్తి జూనియర్‌ కళాశాలలో, అలాగే రైల్వే పాఠశాలల్లో చదివిన విద్యార్థు లు సర్టిఫికెట్ల కోసం ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

Updated Date - 2021-06-17T05:15:48+05:30 IST