దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2021-11-13T08:42:20+05:30 IST

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనతో తెలిపారు. నవంబరు 20వ తేదీ నుంచి పుణె-ఆదిలాబాద్‌ మధ్య ప్రత్యేక రైలు (07776), 23 నుంచి ఆదిలాబాద్‌-పుణె మధ్య ప్రత్యేక రైలు (07851), 21 నుంచి ఆదిలాబాద్‌-పర్లీ మధ్య ప్రత్యేక రైలు (07775), 23 నుంచి పర్లీ-ఆదిలాబాద్‌ మధ్య ప్రత్యేక రైలు (07852)లను నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు.  

Updated Date - 2021-11-13T08:42:20+05:30 IST