రాష్ట్రంలో పలుచోట్ల రైల్‌రోకో యత్నం

ABN , First Publish Date - 2021-10-19T08:08:18+05:30 IST

లఖీంపూర్‌ ఖీరీ ఘటనకు నిరసనగా సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు సోమవారం రాష్ట్రంలోనూ పలు చోట్ల రైల్‌రోకో చేసేందుకు ప్రయత్నించారు.

రాష్ట్రంలో పలుచోట్ల రైల్‌రోకో యత్నం

రైతు సంఘాలు, వామపక్ష నేతల నిరసన

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): లఖీంపూర్‌ ఖీరీ ఘటనకు నిరసనగా సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు సోమవారం రాష్ట్రంలోనూ పలు చోట్ల రైల్‌రోకో చేసేందుకు ప్రయత్నించారు. ఖమ్మం, కొత్తగూడెం, బాసర, తదితర ప్రాంతాల్లో రైతు సంఘాలు, వామపక్షాల నేతలు రైల్‌రోకో కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రైతుల ఉద్యమాన్ని హింసతో అణచివేయాలని మోదీ సర్కారు చూస్తోందని, రైతుల ఉసురు ప్రధానికి తగులుతుందని రైతు సంఘాల నేతలు అన్నారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-10-19T08:08:18+05:30 IST