గ్రేటర్‌లో రేబిస్‌ ల్యాబ్‌!

ABN , First Publish Date - 2021-01-13T08:59:00+05:30 IST

నగరంలో రేబిస్‌ వ్యాధి నిర్ధారణ ల్యాబ్‌ ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. మంగళవారం రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ యూనివర్సిటీలో జరిగిన సదస్సులో ఈ అంశంపై చర్చించారు

గ్రేటర్‌లో రేబిస్‌ ల్యాబ్‌!

నిపుణులతో జీహెచ్‌ఎంసీ చర్చలు


హైదరాబాద్‌ సిటీ, జనవరి 12(ఆంధ్రజ్యోతి): నగరంలో రేబిస్‌ వ్యాధి నిర్ధారణ ల్యాబ్‌ ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. మంగళవారం రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ యూనివర్సిటీలో జరిగిన సదస్సులో ఈ అంశంపై చర్చించారు. 12రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్న సదస్సులో రేబిస్‌ నియంత్రణ తదితర అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రతి రాష్ట్రంలో కనీసం 1-2 ల్యాబ్‌లు ఉండాలన్న భావన వ్యక్తమైనట్టు తెలిసింది. గ్రేటర్‌ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం ఐదు లక్షలకుపైగా వీధి కుక్కలు ఉన్నాయి. ఇళ్లలో పెంచుకునే కుక్కలకు చాలా మటుకు యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌(ఏఆర్‌వీ) చేస్తున్నారు. అధికశాతం వీధి కుక్కలకు వ్యాక్సిన్‌ ఇవ్వడం లేదు. జీహెచ్‌ఎంసీ లెక్కల్లో ఏఆర్‌వీ చేస్తున్నట్టు చూపుతున్నా.. చాలా కుక్కలు ఏదోక సమయంలో రేబిస్‌ బారిన పడుతున్నాయి. వాటి ద్వారా ఆ వ్యాధి మనుషులకూ వ్యాపిస్తోంది. కొందరు మృత్యువాత పడుతున్నారు.  

Updated Date - 2021-01-13T08:59:00+05:30 IST