ఎన్నికల పిటిషన్‌ను త్వరగా విచారించండి

ABN , First Publish Date - 2021-11-09T07:08:52+05:30 IST

2018 శాసనసభ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన జలగం వెంకట్రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.

ఎన్నికల పిటిషన్‌ను త్వరగా విచారించండి

హైకోర్టుకు  సుప్రీం కోర్టు సూచన

న్యూఢిల్లీ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): 2018 శాసనసభ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన జలగం వెంకట్రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చారని హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌ విచారణకు రావడంలేదని వెంకట్రావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 86  ప్రకారం ఈ పిటిషన్‌పై  విచారణను త్వరగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు సూచించింది.

Updated Date - 2021-11-09T07:08:52+05:30 IST