పుట్ట మధు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ABN , First Publish Date - 2021-05-08T18:56:43+05:30 IST

పెద్దపల్లి: పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పుట్ట మధును నేడు పోలీసులు భీమవరంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

పుట్ట మధు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

పెద్దపల్లి: పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నేత పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పుట్ట మధును నేడు పోలీసులు భీమవరంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా మధును పోలీసులు గుర్తించారు. పుట్ట మధు వారం రోజుల్లో నాలుగు రాష్ట్రాలు తిరిగినట్టు సమాచారం. ఆరు ఫోన్లు, నాలుగు కార్లు మార్చినట్టు తెలుస్తోంది. పుట్ట మధును పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. వ్యక్తిగత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే పోతీసులు డిజిటల్ సాక్ష్యం సేకరిస్తున్నారు.


Updated Date - 2021-05-08T18:56:43+05:30 IST