రాజేంద్రనగర్లో రెచ్చిపోయిన దుండగులు
ABN , First Publish Date - 2021-10-26T00:25:09+05:30 IST
జిల్లాలోని రాజేంద్రనగర్లో దుండగులు రెచ్చిపోయారు. ఇనుప రాడుతో

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్లో దుండగులు రెచ్చిపోయారు. ఇనుప రాడుతో ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేసారు. రాజేంద్రనగర్ అత్తాపూర్ చౌరస్తాలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎమ్ సెంటర్లో చోరీకి విఫల యత్నం చేసారు. అర్థరాత్రి ఇనుపరాడ్డుతో ఏటీమ్ మిషన్ను తెరిచేందుకు దుండగుడు ప్రయత్నం చేశాడు. పలుమార్లు రాడ్డుతో బాదాడు. ఎంత చేసినా ఏటీఎం తెరతెరుచుకోక పోవటంతో అగంతకుడు ఉడాయించాడు.
గత రెండు,మూడు రోజులుగా ఈ ఏటీఎంలో చోరీ కోసం అగంతకుడు రెక్కీ నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాంక్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ బృందాలు ఆధారాలను సేకరిస్తున్నాయి. కేసు నమోదు చేసుకుని రాజేంద్రనగర్ క్రైమ్ బృందం దర్యాప్తు చేస్తో్ంది.