విమానాల రెక్కల తయారీ గర్వకారణం: కేటీఆర్
ABN , First Publish Date - 2021-12-09T07:06:37+05:30 IST
ఎఫ్-16 యుద్ధ విమానాల రెక్కలు తెలంగాణలో తయారు

హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఎఫ్-16 యుద్ధ విమానాల రెక్కలు తెలంగాణలో తయారు కావడం గర్వంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదిభట్లలోని ఏరోస్పేస్ క్లస్టర్‌లో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టం లిమిటెడ్, లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన విమాన రెక్కల ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన బుధవారం ట్విటర్ వేదికగా స్పందించారు.