ధర్మారెడ్డి దిష్టిబొమ్మ దహనం
ABN , First Publish Date - 2021-02-02T04:38:00+05:30 IST
ధర్మారెడ్డి దిష్టిబొమ్మ దహనం

ఏటూరునాగారం, ఫిబ్రవరి 1: రిజర్వేషన్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై దళిత శక్తి ప్రోగ్రాం (డీఎ్‌సపీ) నేతలు మండిపడ్డారు. ఏటూరు నాగారం బస్టాండ్ సమీపంలో సోమవారం ధర్మరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కన్వీనర్ నగరకంటి సురేష్, కోఆర్డినేటర్ సాంబశివరావు, నేతలు గణపతి, నరేందర్, తరుణ్, కిరణ్, ప్రవీణ్, సమ్మయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.