ఓసీపీ వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-10-21T05:42:42+05:30 IST
ఓసీపీ వద్ద ఉద్రిక్తత
బొగ్గు వెలికితీతను అడ్డుకున్న భూ నిర్వాసితులు
అధికారుల హామీతో ధర్నా విరమణ
మల్హర్, అక్టోబరు 20 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మం డలం తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు వద్ద బుధవారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. జెన్‌కో అధికారులు తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని తాడిచర్ల, కాపురం గ్రామాలకు చెందిన భూ నిర్వాసితులు ధర్నాకు దిగారు. భూ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశం, డేంజర్ జోన్‌లోని ఇళ్ల సేకరణతో పా టు పరిహారం, పునరావాసం, మిగులు భూములు సేకరణపై స్పష్టత ఇవ్వా లని డిమాండ్ చేస్తూ బొగ్గు వెలికితీతను అడ్డుకున్నారు. నిర్వాసిత కమిటీ సభ్యులు పలువురిని పోలీసులు ముందస్తుగా మంగళవారం రాత్రి అదుపు లోకి తీసుకుని కొయ్యూర్ స్టేషన్‌కు తరలించారు. అలాగే ఓసీపీ వద్ద సుమా రు వంద మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓసీపీ పనుల ను అడ్డుకోవడానికి అటు వైపు వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకొని తిరిగి ఇళ్లలోకి పంపించారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన కొందరు యువకు లు ఓసీపీ వద్దకు చేరుకొని పనులను అడ్డుకున్నారు. దీంతో సుమారు 20 నిమిషాల పాటు బొగ్గు వెలికితీత నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అక్కడి నుంచి వాహనంలో కొయ్యూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో నిర్వాసితులు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న ఎస్సై సత్య నారాయణ వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్ సైతం గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకొని నిర్వాసితులతో మా ట్లాడారు. వారం రోజుల్లో ఇళ్ల సేకరణకు సంబంధించిన సర్వేను ప్రారంభి స్తామని హామీ ఇచ్చారు. అయినా నిర్వాసితులు ససేమిరా అంటూ అక్కడి నుంచి సుమారు రెండు వందల మంది ఓసీపీ వైపు బయల్దేరారు. ఓసీపీ లోకి దూసుకొని వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సుమారు రెండు గంటల పాటు ని ర్వాసితులు మైన్‌లోనే ఉండటంతో పనులు నిలిచిపోయాయి. జెన్‌కో, రెవె న్యూ అధికారుల మాటలు నమ్మి తాము మోసపోయామని నిర్వాసితులు విమర్శించారు. ఓసీపీలో నిత్యం జరిగే బ్లాస్టింగులతో ఇళ్లు బీటలు వారుతు న్నాయని, ఎప్పుడు ఏం ప్రమాదం సంభవిస్తుందో తెలియక బిక్కుబిక్కుమం టూ కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాటా రం డీఎస్పీ బోనాల కిషన్ అక్కడికి చేరుకొని ముందుగా స్థానికులకు ఉద్యో గ అవకాశాలకు సంబంధించి ప్రాజెక్టు హెడ్ ప్రభాకర్ రెడ్డితో మాట్లాడిం చారు. మరో మూడు నెలల్లో సీహెచ్‌పీ పనులు పూర్తికాగానే ఉద్యోగాలు క ల్పించే అవకాశం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. జెన్‌కో అధికారులతో మాట్లాడగా వారం రోజుల్లో ఇళ్ల సర్వేకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభిం చనున్నట్లు అధికారులు తెలపడంతో భూ నిర్వాసితులు వెనుతిరిగారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతలపల్లి మల్హల్‌రావు, భూ నిర్వాసితులు బొబ్బిలి రాజు, బొమ్మకంటి కిషన్, కోడెల వెంకన్న, రామిడి రాజసమ్మయ్య, కాటారం, మహదేవపూర్ సీఐలు రంజిత్ రావు, కిరన్ కుమార్ పాల్గొన్నారు.