బొగ్గు బావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీబీజీకేఎస్‌ నిరసన

ABN , First Publish Date - 2021-10-29T05:06:10+05:30 IST

బొగ్గు బావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీబీజీకేఎస్‌ నిరసన

బొగ్గు బావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీబీజీకేఎస్‌ నిరసన

భూపాలపల్లిటౌన్‌, అక్టోబరు 28: సింగరేణి బొగ్గు బావులను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో గురువారం ఆందోళనకు దిగారు. నల్లబ్యాడ్జీలు ఽధరించి నిరసన తెలిపారు.  ఏరియాలోని అన్ని గనులు, వివిధ విభాగాల్లోని అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఏరియా బ్రాంచి ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ నాయకులు బడితల సమ్మయ్య, ఏబూసి ఆగయ్య, రత్నం సమ్మిరెడ్డి, మండ సంపత్‌, సంపత్‌, ప్రభాకర్‌, శంకర్‌, ప్రేంసింగ్‌  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T05:06:10+05:30 IST