భారత ఆహార సంస్థను కాపాడుకుందాం
ABN , First Publish Date - 2021-04-06T06:12:05+05:30 IST
భారత ఆహార సంస్థను కాపాడుకుందాం
వరంగల్ టౌన్, ఏప్రిల్ 5 : భారత ఆహార సం స్థను కాపాడుకుందామని ఏఐకేఎ్‌ససీసీ వరంగల్ రూరల్ జిల్లా కో కన్వీనర్ రాచర్ల బాలరాజు అన్నారు. సోమవారం కాశిబుగ్గలోని ఎఫ్‌సీఐ గోదాముల వద్ద ఏఐకేఎ్‌ససీసీ ఆధ్వర్యంలో చే పట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. దేశంలోని అన్ని ము ఖ్యమైన రంగాలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేసేందు కు కుట్ర చేస్తోందని బాలరాజు ఆరోపించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను రద్దు చేసి దోపిడీదారులకు గిడ్డంగులను అప్పగించేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసిందని దానిని అడ్డుకోవాలన్నారు. రైతు సంఘం నాయకుడు ఎన్‌రెడ్డి హంసారెడ్డి అధ్యక్షతన చేపట్టిన ధర్నాలో బీరం రాములు, ఓదెల రాజ య్య, సుంచు వీరన్న, సాంబయ్య, సుద్దాల వీరన్న, వెంకటయ్య, కుమార్, ఐలయ్య, రమేష్, కొంరయ్య పాల్గొన్నారు.
కాజీపేట ఎఫ్‌సీఐ వద్ద..
కాజీపేట: ప్రజా పంపిణీ వ్యవస్థ, కనీస మద్దతు ధరలను నిర్వీర్యం చేస్తూ తీసుకువచ్చిన నిత్యావసర సరుకుల చట్టా న్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండి యా కిసాన్ సంఘర్ష్ కో- ఆర్డినేషన్ కమిటీ నాయకులు సో మవారం కాజీపేట ఎఫ్‌సీఐ ఎదుట ధర్నా చేశారు. కమిటీ జి ల్లా కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని మోదీ రైతులు, దేశప్రజలను దోచి పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సుద్దమల్ల భాస్కర్, నారాయణ, రాజు, పాణి, రాజేందర్, వీరన్న పాల్గొన్నారు.