గ్లూ ట్రాప్‌’పై నిషేధం

ABN , First Publish Date - 2021-08-21T07:13:13+05:30 IST

ఎలుకలను పట్టేందుకు ఉపయోగించే ‘గ్లూ ట్రాప్‌’లపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ‘గ్లూ’ (జిగురు) తయారీ, అ మ్మకం, వాడకాలను పూర్తి స్థాయి లో నిషేధిస్తున్నట్లు ప్రకటించింది

గ్లూ ట్రాప్‌’పై నిషేధం

‘పెటా’ విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆగస్టు 20: ఎలుకలను పట్టేందుకు ఉపయోగించే ‘గ్లూ ట్రాప్‌’లపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ‘గ్లూ’ (జిగురు) తయారీ, అ మ్మకం, వాడకాలను పూర్తి స్థాయి లో నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. గ్లూ ట్రాప్‌ వినియోగం వల్ల మూగ జీవాలు తీవ్రమైన హింసకు గురవుతున్నాయని, దీన్ని వెంటనే నిషేధించాలని ‘పీపుల్‌ ఫర్‌ ది ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనిమల్స్‌’(పెటా) ఇండియా వారు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్లూ ట్రాప్‌ అక్రమ వాడకాన్ని నిషేధిస్తూ ఎనిమల్‌ వె ల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఏఐడబ్ల్యూబీఐ) జారీ చేసిన సర్కులర్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ‘పెటా’ విజ్ఞాపనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. గ్లూ ట్రాప్‌లపై నిషేధం విధించింది.  


Updated Date - 2021-08-21T07:13:13+05:30 IST