తెలంగాణలో భారీగా పెరిగిన భూగర్భ జలాలు: డా. ప్రవీణ్‌రావు
ABN , First Publish Date - 2021-07-24T21:01:28+05:30 IST
తెలంగాణ పెద్దయెత్తున జరుగుతున్న నీటి పారుదల రంగ అభివృద్ది వల్ల భూగర్భ జలాలు భారీగా పెరిగాయని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. ప్రవీణ్‌రావు అభ్రిపాయపడ్డారు.

హైదరాబాద్: తెలంగాణ పెద్దయెత్తున జరుగుతున్న నీటి పారుదల రంగ అభివృద్ది వల్ల భూగర్భ జలాలు భారీగా పెరిగాయని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. ప్రవీణ్‌రావు అభ్రిపాయపడ్డారు. దీంతో పాటు పెద్దయెత్తున చేపట్టిన హరితహారం కూడా భూగర్భజలాలు పెరగడానికి దోహదపడిందని అన్నారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రుతుపవనాలు కూడా ప్రతి ఏటా పూర్తి ఆశాజనకంగా ఉంటున్నాయని ఆయన తెలిపారు. భూగర్భ జలాల పెరుగుదలపై సమగ్ర అధ్యయనం జరగవలసిన అవసరం ఉందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో, భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన నేషనల్ రిమోట్‌సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్సి)మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది.
నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ కింద ఈ ఒప్పందం కుదిరింది. వర్శిటీ ఉప కులపతి డా.ప్రవీణ్‌రావు ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో వర్శిటీ రిజిస్ర్టార్ డాక్టర్ సుధీర్ కుమార్, ఎన్ఆర్ఎస్సి డిప్యూటీ డైరెక్టర్ డా. వెంకటేశ్వరరావు ఒప్పందాలపై సంతకాలుచేశారు. ఒప్పంద పత్రాల్ని పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, వెంకటేశ్వర్లు పరస్పరం అందజేసుకున్నారు. ఎవాపోట్రాన్పిపిరేషన్, సాయిల్ మాయిశ్చర్ తదితర అంశాల్ని అధ్యయనం చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. ఈ ఒప్పందం ద్వారా ఈ రెండు సంస్ధలు సంయుక్తంగా పరిశోధనలు సాగిస్తాయి. అదే విధంగా ఫ్యాకల్టీకి, పీజీ విద్యార్ధులకు శిక్షణ ఇవ్వడానికి వీలు కులుగుతందన్నారు. వర్శిటీ ప్రాంగణంలో టవర్, తదితర పరికరాలను ఎన్ఆర్ఎస్సి ఏర్పాటు చేస్తుంది. వ్యవసాయ వర్శిటీ ఏర్పాటైన అనతి కాలంలోనే దేశంలో టాప్ వర్శిటీల స్ధానంలో నిలబడిందని ప్రవీణ్‌రావు తెలిపారు. వర్శిటీ రూపొందించిన వెరైటీలు దేశంలో రైతాంగాన్ని ఆకర్షించాయన్నారు.