సీఎం కేసీఆర్‌కు యువతపై పట్టింపేది..?

ABN , First Publish Date - 2021-02-06T04:24:11+05:30 IST

సీఎం కేసీఆర్‌కు యువతపై పట్టింపేది..?

సీఎం కేసీఆర్‌కు యువతపై పట్టింపేది..?
మహబూబాబాద్‌లో మాట్లాడుతున్న టీజేఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం

 టీజేఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం

మహబూబాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 5 : స్వరాష్ట్ర ఉద్యమంలో ముందుండి పోరాడిన యువతపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రేమ ఎక్కడ ఉందని వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీజేఎస్‌ అభ్యర్థి ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు ముత్యాలమ్మగూడెం ఆశ్రమ పాఠశాల జమాండ్లపల్లి, కంబాలపల్లి పాఠశాలలు, టీఎ్‌సడబ్ల్యూఆర్‌ఎస్‌, ఆశ్రమ పాఠశాల, గిరిజన డిగ్రీ, నలంద డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని ఆశపడిన యువతకు నిరాశ ఎదురైందని వాపోయారు. పట్టభద్రుల ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకగా తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ డోలి సత్యనారాయణ, టీపీటీఎప్‌ రాష్ట్ర కార్యదర్శి మైస శ్రీనివాస్‌, గోపగాని శంకర్‌రావు, పిల్లి సుధాకర్‌, ఇరుగు మనోజ్‌, పరామత్మచారి, సుధాకర్‌ పాల్గొన్నారు. 

 కురవి: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని టీజేఎస్‌ ఎమ్మెల్సీ అ భ్యర్థి ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కురవి వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో కోదండరాం మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. డోలి సత్యనారాయణ, గోపగాని శంకర్‌రావు, పిల్లి సుధాకర్‌, ఇ రుగు మనోజ్‌, గులగట్టు సుధాకర్‌,గణేష్‌ పాల్గొన్నారు. 

 బయ్యారం : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని టీజేఎస్‌ నల్లగొండ, వరంగ ల్‌, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కో దండరాం అన్నారు. బయ్యారంలో శుక్రవారం కోదండరాం పట్టభద్రులు, ఉద్యోగుల నుంచి ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో హరికిషన్‌ ప్రసాద్‌, వెంకటేశ్వ ర్లు, శ్రీధర్‌, లింగరాజు, ధనంజయ్య, శ్రీదర్‌సింగ్‌, సం తోష్‌, శంకర్‌రావు 

Updated Date - 2021-02-06T04:24:11+05:30 IST