ప్రియుడి ఫోన్.. ఆగిన ప్రియురాలి పెళ్లి
ABN , First Publish Date - 2021-05-24T09:58:19+05:30 IST
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో ఓ వ్యక్తి వివాహం సినీ ఫక్కీలో ఆగిపోయింది. యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట మండలానికి చెందిన ఓ యువకుడికి గుంటూరు జిల్లాకు చెందిన యువతితో ఇంకో అరగంటైతే మాంగళ్యధారణ ముగిసేది.

నార్కట్‌పల్లి, మే 23: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో ఓ వ్యక్తి వివాహం సినీ ఫక్కీలో ఆగిపోయింది. యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట మండలానికి చెందిన ఓ యువకుడికి గుంటూరు జిల్లాకు చెందిన యువతితో ఇంకో అరగంటైతే మాంగళ్యధారణ ముగిసేది. ఇంతలో వరుడికి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఆ వధువు, తాను కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. ఈ విషయాన్ని వరుడు తన కుటుంబసభ్యులకు చెప్పి వధువును నిలదీశాడు. ఆమె అస్పష్టంగా సమాధానం ఇవ్వడంతో.. పోలీసులకు వరుడు సమాచారమిచ్చాడు. ఫోన్ చేసిన యువకుడిని స్టేషన్‌కు తరలించి పోలీసులు విచారించారు. ప్రేమ వ్యవహారం బయటపడటంతో పెళ్లి కుమారుడితోపాటు పెళ్లి కూతురి కుటుంబసభ్యులు సైతం పెళ్లికి నిరాకరించారు.