ప్రైవేటు ఆస్పత్రులను స్వాధీనం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-05-18T08:57:21+05:30 IST

తమిళనాడు, మహారాష్ట్ర తరహాలో కరోనా వైద్య చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డా.చెరుకు సుధాకర్‌ డిమాండ్‌ చేశారు.

ప్రైవేటు ఆస్పత్రులను స్వాధీనం చేసుకోవాలి

కరోనాకు వైద్యం చేయాలి: చెరుకు సుధాకర్‌ 

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): తమిళనాడు, మహారాష్ట్ర తరహాలో కరోనా వైద్య చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డా.చెరుకు సుధాకర్‌  డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మొత్తం  53782 బెడ్లు ఉంటే ప్రైవేట్‌లో 29341 బెడ్లు ఉన్నాయన్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, ఇతర సంస్థల చొరవతో పేదలు మెరుగైన వైద్య సేవలు పొందడానికి ప్రైవేట్‌ ఆసుపత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు.  

Updated Date - 2021-05-18T08:57:21+05:30 IST