రాష్ట్రంలోనే పోలీసులకు ప్రాధాన్యం: హోంమంత్రి

ABN , First Publish Date - 2021-12-25T07:45:53+05:30 IST

తెలంగాణ వచ్చిన తర్వాత పోలీసులకు ప్రాధాన్యం పెరిగిందని

రాష్ట్రంలోనే పోలీసులకు ప్రాధాన్యం: హోంమంత్రి

సిద్దిపేట అర్బన్‌: తెలంగాణ వచ్చిన తర్వాత పోలీసులకు ప్రాధాన్యం పెరిగిందని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాల శివారులో పోలీస్‌ వెల్ఫేర్‌ కన్వెన్షన్‌ హాల్‌ను మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవి్‌సతో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి పోలీస్‌ కన్వెన్షన్‌ హాల్‌ నిర్మించడం గర్వంగా ఉన్నదన్నారు. తెలంగాణలో పోలీసులంటే ప్రజలకు నమ్మకం ఏర్పడిందని ఆయన అన్నారు. మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. కన్వెన్షన్‌ హాల్‌తో వచ్చే ప్రతి రూపాయిని పోలీసుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని వెల్లడించారు. డీజీపీ మాట్లాడుతూ.. సీఎం ఆశీస్సులతో ఎక్కడా లేని విధంగా భవనాన్ని నిర్మించుకున్నామని తెలిపారు.


Updated Date - 2021-12-25T07:45:53+05:30 IST