పీఆర్‌సీ అమలు ఎప్పుడో ?
ABN , First Publish Date - 2021-05-24T23:26:29+05:30 IST
రాష్ట్ర ప్రభుత్యోద్యోగులకు పీఆర్‌సీ అమలు మరికొంత సమయం పట్టనుంది.

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్యోద్యోగులకు పీఆర్‌సీ అమలు మరికొంత సమయం పట్టనుంది. వాస్తవానికి ఈ నెల నుంచే పీఆర్‌సీ అమలు కావాల్సి ఉంది. తొలుత ఎన్నికల కోడ్, ఆ తర్వాత మరికొన్ని కారణాలరీత్యా జరిగిన జాప్యం... తదితర పరిణామాల నేపధ్యంలో పీఆర్‌సీ అమలు సాధ్యం కాలేదు. ఇక... ఈ(మే) నెల వేతనాలకు సంబంధించి కూడా పీఆర్సీ అమలు లేనట్టే కనిపిస్తోందని ప్రభెత్వవర్గాల నుంచే వినవస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలిలా ఉన్నాయి.
కొత్త ఆర్ధిక సంవత్సరం(2021-22) ప్రారంభం(ఏప్రిల్ ఒకటి) నుండి కొత్త పీఆర్‌సీని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే... కరోనా విజృంభణ, తదితర కారణాలతో నేపధ్యంలో అమలు వాయిదాపడుతూ వస్తోంది. కాగా... వచ్చే నెల(జూన్)లో కొత్త జీతంతో పాటు ఏప్రిల్, మే బకాయిలను కూడా చెల్లించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని వినవస్తున్నప్పటికీ... మొత్తం కలిపి.. జులైలో తప్ప ఉద్యోగులకు అందే అవకాశం లేదని సమాచారం.