పీఆర్సీపై ఎంజీఎంలో సంబురాలు

ABN , First Publish Date - 2021-03-24T06:10:13+05:30 IST

పీఆర్సీపై ఎంజీఎంలో సంబురాలు

పీఆర్సీపై ఎంజీఎంలో సంబురాలు
కేక్‌కట్‌ చేసి సంబురాలు చేసుకుంటున్న టీఎన్జీవోస్‌ సభ్యులు

హన్మకొండ అర్బన్‌, మార్చి 23 : సీఎం కేసీఆర్‌ ప్రకటించిన పీఆర్సీని స్వాగతిస్తూ మంగళవారం టీఎన్జీవోస్‌ ఉమ్మడి వరంగల్‌జిల్లా కోఆర్డినేటర్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు కోలా రాజే్‌షగౌడ్‌ ఆధ్వర్యంలో ఎంజీఎం ఆస్పత్రిలో సంబురాలు జరుపుకున్నారు. ఎం జీఎం సూపరింటెండెంట్‌ చాంబర్‌లో కేక్‌కట్‌ చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు జి.రామకిషన్‌, ఆర్‌ఎంవో-2 వెంకటరమణ, టీఎన్జీవోస్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ వరంగల్‌ అర్బన్‌ అసోసియేట్‌ అధ్యక్షుడు బస్వరాజు కిరణ్‌, మురళి, ఉద్యోగులు పాల్గొన్నారు.

కేయూ క్యాంపస్‌: కేయూలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వర్సిటీ మొదటి గేటు వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కేయూ ఉద్యోగ సంఘాల నాయకులు డాక్టర్‌ పుల్లా శ్రీనివాస్‌, నందయ్య, బాలాజీ, రవికుమార్‌, చిరంజీవి, రాజమౌళి, కిరణ్‌, ప్రవీణ్‌, బాబు, మహర్షి, కొర్నేల్‌, దయాకర్‌, గడ్డం శివ, శంకర్‌, ప్రభాకర్‌  పాల్గొన్నారు. 

వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌ : ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని జూలై 2018 నుంచే అమలు చేయాలని టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె. సోమశేఖర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం హసన్‌పర్తి మండల కార్యవర్గ స మావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2018 నుం చి పీఆర్సీని అమలు చేయకపోతే ఉపాధ్యాయ, ఉద్యోగులకు తీవ్రనష్టం వాటిల్లుతుందన్నారు. 12 నెలల బకాయిలను రిటైర్మెంట్‌ బకాయిలతో చెల్లిస్తాననడం సరికాదన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు బేసిక్‌ పే ఇచ్చిన తర్వాత 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలన్నారు. పీఆర్సీ సత్వరమే అమలుకు సీఎం ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రాజు, వెంకట్‌రెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సత్యనారాయణ, నిర్మల, కోశాధికారి కుమారస్వామి, కార్యదర్శులు శోభారాణి, రమాదేవి, సుధారాణి, నాగరాజు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

ఉద్యోగుల వయోపరిమితి తగ్గించాలి

నయీంనగర్‌ : ప్రభుత్వోద్యోగులకు వయో పరిమితి తగ్గించాలని ఏబీఎ్‌సఎఫ్‌, ఏఐఎ్‌సబీ విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం హన్మకొండ నయీంనగర్‌లో నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని వారు రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్‌, ఏఐఎ్‌సబీ జిల్లా కార్యదర్శి హకింనవీద్‌ మాట్లాడుతూ.. ఉద్యోగస్తులకు వయోపరిమితి పెంచడం వల్ల నిరుద్యోగ సమస్య ఎక్కువగా పెరుగుతుందన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థులకు, యువకులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ఉద్యోగులకు వయోపరిమితిని తగ్గించి ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం రాస్తారోకో చేస్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు అన్వేష్‌, వంశీ, రంజిత్‌, రాజ్‌కుమార్‌, నవ్య, శ్రీలత, కావ్య తదితరులు పాల్గొన్నారు. Updated Date - 2021-03-24T06:10:13+05:30 IST