ప్రవీణ్‌రావు మా కుటుంబానికి స్నేహితుడు: ఏవీ సబ్బారెడ్డి

ABN , First Publish Date - 2021-01-07T01:20:59+05:30 IST

బోయిన్‌పల్లి కిడ్నాప్‌, భూవివాదంతో తనకు సంబంధం లేదని టీడీపీ నేత ఏవీ సబ్బారెడ్డి కొట్టిపారేశారు.

ప్రవీణ్‌రావు మా కుటుంబానికి స్నేహితుడు: ఏవీ సబ్బారెడ్డి

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్‌, భూవివాదంతో తనకు సంబంధం లేదని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి కొట్టిపారేశారు. కిడ్నాప్‌ కేసులో తనను ఎందుకు ఏ1గా చేర్చారో తెలియదని చెప్పారు. ప్రవీణ్‌రావు కిడ్నాప్‌ కేసుతో తనకు సంబంధం లేదని తెలిపారు. గతంలో మాజీమంత్రి భూమా అఖిలప్రియపై కేసు పెట్టానని, తనను పంచడానికి ఆమె సుపారీ కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. అలాంటి వారితో కలిసి తానెందుకు కిడ్నాప్‌ చేస్తాను? అని ఏవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. పోలీస్‌ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. కిడ్నాప్‌ కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని ప్రకటించారు. ప్రవీణ్‌రావు తమ కుటుంబానికి స్నేహితుడని, నిజాలు బయటకు వచ్చాక మీడియా ముందుకు వస్తానని ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.


బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో టీడీపీ నేత ఏవీ  సుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయప్ప సొసైటీ దగ్గర ఏవీ సుబ్బారెడ్డిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రవీణ్‌రావు కిడ్నాప్‌ కేసులో ఏవీ సుబ్బారెడ్డిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కిడ్నాప్ కేసులో ఏ1గా సుబ్బారెడ్డి, ఏ2గా మాజీ మంత్రి అఖిలప్రియ, ఏ3గా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ ఉన్నారు. అఖిలప్రియపై 448,419,341,342,506,366,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే అఖిలప్రియ, ఆమె సోదరుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2021-01-07T01:20:59+05:30 IST