ఈ నెల 17 నుంచి హైదరాబాద్‌లో ప్రజా ఉద్యమాలు

ABN , First Publish Date - 2021-01-12T12:16:00+05:30 IST

ఈ నెల 17 నుంచి హైదరాబాద్‌లో ప్రజా ఉద్యమాలు

ఈ నెల 17 నుంచి హైదరాబాద్‌లో ప్రజా ఉద్యమాలు

హైదరాబాద్/రాంనగర్‌ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలు కేవలం రైతులకు మాత్రమే నష్టం చేయడం కాకుండా రాజ్యాంగానికి, సామాజిక న్యాయానికి తీరని అన్యాయం చేస్తా యని, వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలని ఆలిండియా కిసాన్‌ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బా బు ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలను నిరసిస్తూ ఈ నెల 17న ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం, 20వ తేదీన డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, బంధు సొసైటీ అధ్యక్షుడు పి.వీరస్వామి, సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు, దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కార్యదర్శి శంకర్‌, పీపుల్స్‌ మానిటరింగ్‌ కమిటీ కార్యదర్శి శివలింగం, రైతు సంఘం నాయకులు ఎం.శోభన్‌, గిరిజన సంఘం అధ్యక్షుడు ధర్మానాయక్‌, చర్మకారుల సంఘం అధ్యక్షుడు సాయి సత్యనారాయణ  మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-01-12T12:16:00+05:30 IST