వేలాదిమందితో 15న ప్రగతి భవన్‌ ముందు నిరసన

ABN , First Publish Date - 2021-02-05T12:49:55+05:30 IST

వేలాదిమందితో ప్రగతిభవన్‌ ముందు నిరసన తెలుపుతామని

వేలాదిమందితో 15న ప్రగతి భవన్‌ ముందు నిరసన

హైదరాబాద్/బర్కత్‌పుర : రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలు చేస్తూ వెంటనే జీవో జారీ చేయకపోతే ఈనెల 15న వేలాదిమందితో ప్రగతిభవన్‌ ముందు నిరసన తెలుపుతామని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, వైశ్య సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుస్సా శ్రీనివాస్‌, రెడ్డి సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు అప్పమ్మగారి రాంరెడ్డి, రెడ్డి జాగృతి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు బి.మాధవరెడ్డి, ఈడబ్ల్యూఎస్‌ ఫెడరేషన్‌జాతీయ అధ్యక్షుడు తాడిశెట్టి పశుపతులు తెలిపారు. మార్చి 21న హైదరాబాద్‌లో లక్షలాదిమందితో ఓసీల కదనబేరి సభను నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. గురువారం బషీర్‌బాగ్‌ప్రె్‌సక్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారుమాట్లాడారు. 

Updated Date - 2021-02-05T12:49:55+05:30 IST