మరణానంతరం నేత్రాల సేకరణ

ABN , First Publish Date - 2021-12-31T19:48:39+05:30 IST

లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ జనగామ ఆధ్వర్యంలో మరణానంతరం నేత్రాలను సేకరించారు.

మరణానంతరం నేత్రాల సేకరణ

జనగామ కల్చరల్‌, డిసెంబరు 30: లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ జనగామ ఆధ్వర్యంలో మరణానంతరం నేత్రాలను సేకరించారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలో పోకల అంజమ్మ మృతి చెందగా లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ జనగామ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులతో సంప్రదించి నేత్రాలను సేకరించారు. ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాల వైద్యుడు డాక్టర్‌ నరేందర్‌ జనగామ జిల్లా కేంద్రానికి వచ్చి నేత్రాలను సేకరించి హైదరాబాద్‌లోని ఎల్‌వీ ఆస్పత్రికి పంపించారు. క్లబ్‌ ప్రతినిధులు జైన రమేష్‌, చార్టర్‌ సభ్యులు పజ్జూరి జయహరి, గంగిశెట్టి ప్రమోద్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T19:48:39+05:30 IST