పేదల సిరి సీతక్క

ABN , First Publish Date - 2021-05-30T08:57:00+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆదివాసీలు పస్తులు ఉండకూడదన్నది ఆమె ఆశయం.. ఇందుకోసం ఎంతటి సాహసానికైనా వెనకాడకుండా ముందడుగు వేస్తున్నారు.

పేదల సిరి సీతక్క

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆదివాసీలు పస్తులు ఉండకూడదన్నది ఆమె ఆశయం.. ఇందుకోసం ఎంతటి సాహసానికైనా వెనకాడకుండా ముందడుగు వేస్తున్నారు. ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క. సరైన రోడ్డు మార్గం లేని మారుమూల పల్లెలకు సైతం వెళ్లి తనకు చేతనైన సాయం చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం అడవిరంగాపూర్‌ శివారు మారుమూల గ్రామమైన బండ్లపాడుకు ఆమె ఎడ్లబండిపై వెళ్లి గొత్తికోయలకు నిత్యావసర సరుకులు అందజేశారు.

- వెంకటాపూర్‌(రామప్ప)

Updated Date - 2021-05-30T08:57:00+05:30 IST