తాగి ఊగి కరోనా పూసుకోమంటావా..?
ABN , First Publish Date - 2021-12-31T19:28:26+05:30 IST
‘కేసీఆర్.. ను వ్వేమి ముఖ్యమంత్రివి?.. ఒకవైపు కరోనా థర్డ్‌వేవ్ రాష్ట్రా న్ని కమ్మేస్తుంటే.. అప్రమత్తమవ్వాల్సింది పోయి బాధ్యతారహితంగా వ్యవహరిస్తా వా..? నూతన సంవత్సర వేడుకలను కట్టడి చేయాల్సింది..

సీఎంపై పొన్నాల ఫైర్
హనుమకొండ సిటీ, డి సెంబరు 30 : ‘కేసీఆర్.. ను వ్వేమి ముఖ్యమంత్రివి?.. ఒకవైపు కరోనా థర్డ్‌వేవ్ రాష్ట్రా న్ని కమ్మేస్తుంటే.. అప్రమత్తమవ్వాల్సింది పోయి బాధ్యతారహితంగా వ్యవహరిస్తా వా..? నూతన సంవత్సర వేడుకలను కట్టడి చేయాల్సింది పోయి అర్ధరాత్రి వరకు బార్లకు అనుమతిలిస్తా వా..?’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో పొన్నాల పాల్గొన్నారు. ఒమైక్రాన్ వైరస్ విస్త రిస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. అర్ధరాత్రి వరకు బార్లకు అ నుమతులు ప్రజలు ఇవ్వమని అడిగారా? అని ప్రశ్నించారు. తాగి.. ఊగి.. కరో నా పూసుకోమనేది కేసీఆర్ ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. ప్రజల వ్యసనాన్ని ఆ దాయ మార్గంగా మార్చుకునే దౌర్భాగ్యపు స్థితికి దిగజారడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
రాష్ట్ర ఆవిర్భావ సమయంలో మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ స్వార్థ ఆర్థిక ప్రయోజనాలతో అప్పుల ఊబిలో కూరుకుపోతోందని పొన్నాల అన్నారు. నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం రాష్ట్రంపై ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇకపై రైతులే ఉరి వేస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు. రైతులను ఆర్థికంగా నష్టపరి చి రోడ్డున పడేసే చర్యలే ఇందుకు కారణం కానున్నాయన్నారు. రెండు ప్రభుత్వాలు రైతుల పొట్టకొడుతున్నాయని మండిపడ్డారు. సన్నాలు వద్దన్న కేసీఆర్.. తాను మాత్రం ఎందుకు పండించాడని ప్రశ్నించారు. యాసంగిలో వరి వద్దన్న ముఖ్యమంత్రి 150 ఎకరాల్లో వరి ఎందుకు వేశాడో రైతులకు బాహాటంగా వివరించాలని డిమాండ్ చేశాడు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నా యిని రాజేందర్‌రెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, బత్తిని శ్రీనివాస్, దొమ్మాటి సాంబయ్య, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.