పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ABN , First Publish Date - 2021-03-14T14:08:01+05:30 IST

రాష్ట్రంలోని పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌; హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాలకు ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం ...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌; హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాలకు ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలను శానిటైజ్‌ చేయించిన అధికారులు.. ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించారు. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. రెండు నియోజకవర్గాల్లో 1,530 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 7,560 మంది సిబ్బందిని నియమించింది. రెండు నియోజకవర్గాల్లో భారీసంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో బ్యాలెట్‌ను దినపత్రిక సైజులో ముద్రించారు. వీటికి అనుగుణంగా జంబో బ్యాలెట్‌ బాక్సులను రూపొందించారు. రెండు నియోజకవర్గాల పరిధిలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 15వేల మందికిపైగా సిబ్బందిని మోహరించారు. సున్నితమైన ప్రాంతాల్లో అవసరం మేరకు అదనపు బలగాలను అందుబాటులో ఉంచారు.

Updated Date - 2021-03-14T14:08:01+05:30 IST