అక్రమ గన్‌ పౌడర్‌ కేంద్రంపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2021-02-26T21:22:44+05:30 IST

నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న గన్ పౌడర్ కేంద్రంపై సౌత్‌జోన్‌

అక్రమ గన్‌ పౌడర్‌ కేంద్రంపై పోలీసుల దాడి

హైదరాబాద్‌: నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న గన్ పౌడర్ కేంద్రంపై సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. ఫలక్‌నుమా పరిధిలోని వట్టెపల్లిలో అక్రమంగా గన్‌ పౌడర్‌ తయారు చేస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో గన్ పౌడర్ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. దాడిలో 34 బ్యాగుల గన్ పౌడర్, 9 బ్యాగుల సోడియం నైట్రేట్, రెండు బ్యాగుల సల్ఫర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేంద్రంలో అక్రమంగా తయారు చేస్తున్న గన్‌పౌడర్‌ను కరీంనగర్‌కు ముఠా రవాణా చేస్తున్నది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-02-26T21:22:44+05:30 IST