నటుడు నిఖిల్‌ను అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-05-24T10:50:22+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో కారులో బయటకు వెళ్లిన సినీ నటుడు నిఖిల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ-పాస్‌ లేకుండా బయటకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.

నటుడు నిఖిల్‌ను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, మే 23 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సమయంలో కారులో బయటకు వెళ్లిన సినీ నటుడు నిఖిల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ-పాస్‌ లేకుండా బయటకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని నిఖిల్‌ స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 సమయంలో సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో ఉన్న ఓ పేషెంట్‌కు మందులు ఇవ్వడానికి నిఖిల్‌.. ఉప్పల్‌ నుంచి బయలుదేరారు. తార్నాక-సికింద్రాబాద్‌ మార్గంలో ఓ చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆయనను ఆపగా.. పేషెంట్‌కు మందులు ఇచ్చేందుకు వెళ్తున్నానని సమాధానం ఇచ్చారు. ఈ-పా్‌సకోసం 9సార్లు ప్రయత్నించినా సర్వర్‌ సమస్య వల్ల లభించలేదని తెలిపారు. మెడికల్‌ ఎమర్జెన్సీ నేపథ్యంలో అనుమతిస్తారని భావించానని చెప్పారు. అయినా పోలీసులు వినిపించుకోకపోవడంతో ఆయన ట్విటర్‌ ద్వారా హైదరాబాద్‌ పోలీసులను సంప్రదించడంతో.. సమస్య పరిష్కారమైంది.

Updated Date - 2021-05-24T10:50:22+05:30 IST