బీజేపీ ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-10-30T02:10:18+05:30 IST

వరంగల్‌ జిల్లా కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ ఉద్రిక్తతలకు దారితీసింది. హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తోపాటు

బీజేపీ ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్న పోలీసులు

వరంగల్: వరంగల్‌ జిల్లా కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ ఉద్రిక్తతలకు దారితీసింది. హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తోపాటు మాజీ ఎంపీ వివేక్‌, జితేందర్‌రెడ్డి వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఎన్నికలపై మాట్లాడేందుకు అనుమతి లేదంటూ వరంగల్‌ ఏసీపీ గిరి.. బీజేపీ నేతలను అడ్డుకోబోయారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన బీజేపీ నేతలు వివేక్‌, జితేందర్‌రెడ్డి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో ఈటల రాజేందర్‌ హోటల్‌కు చేరుకోవడంతో ఆయన్ను గేట్‌ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గొడవ ఇంకాస్త పెద్దదయింది. ఎన్నికలపై మాట్లాడబోమంటూ, ఈటలను మాట్లాడించమని  బీజేపీ నేతలు స్పష్టం చేయడంతో ప్రెస్‌మీట్‌కు అనుమతించారు. దీంతో ఈటల ప్రెస్‌మీట్‌లో పాల్గొనలేదు. 

Updated Date - 2021-10-30T02:10:18+05:30 IST