పోడు రైతులపై దమనకాండ ఆపాలి

ABN , First Publish Date - 2021-08-21T07:14:44+05:30 IST

రాష్ట్రంలో పోడు రైతులపై అటవీ అధికారులు, పోలీసుల దమనకాండను వెంటనే ఆపివేయాలని తెలంగాణ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీఆర్‌) నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్‌ సోలిపేట రామచంద్రారెడ్డి, ఓపీడీఆర్‌ ఉపాధ్యక్షుడు జతిన్‌రావులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పోడు రైతులపై దమనకాండ ఆపాలి


 ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ 

నల్లకుంట, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోడు రైతులపై అటవీ అధికారులు, పోలీసుల దమనకాండను వెంటనే ఆపివేయాలని తెలంగాణ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీఆర్‌) నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్‌ సోలిపేట రామచంద్రారెడ్డి, ఓపీడీఆర్‌ ఉపాధ్యక్షుడు జతిన్‌రావులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పోడు రైతుల సమస్యల అధ్యయనానికి ఓపీడీఆర్‌ ఆధ్వర్యంలో ఈ నెల 4,5,6 తేదీల్లో ఆసిఫాబాద్‌, అదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నిజనిర్ధారణ కమి టీ సందర్శించిందన్నారు. దాదాపు 250 మంది రైతులతో మాట్లాడి సమాచారం సేకరించామని చెప్పారు. శుక్రవారం హైదర్‌గూడలో నివేదిక వివరాలు వారు వెల్లడించారు. అటవీ ప్రాంత భూములపై శాశ్వత హక్కులు పొందేందుకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌ అందరిలో ఉందన్నారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌ పేరిట పంటలను నాశనం చేయడం ఆపాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-08-21T07:14:44+05:30 IST