నేటి నుంచి పీజీ సెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2021-12-15T08:40:05+05:30 IST

రాష్ట్రంలో పీజీ సీట్ల భర్తీకి సంబంధించిన రెండో దశ కౌన్సెలింగ్‌ను ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహించనున్నామని పీజీ సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి ప్రకటించారు.

నేటి నుంచి పీజీ సెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పీజీ సీట్ల భర్తీకి సంబంధించిన రెండో దశ కౌన్సెలింగ్‌ను ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహించనున్నామని పీజీ సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి ప్రకటించారు. ఈ కౌన్సెలింగ్‌లో భాగంగా బుధవారం నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ను చేసుకోవాలి. ఈనెల 18న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. అనంతరం ఈనెల 24 నుంచి 26వ తేదీ మధ్య అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. 30న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 31 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. కాగా ఫార్మసీ సీట్ల భర్తీ ప్రక్రియంలో భాగంగా అభ్యర్థులు తమ ఆప్షన్లను నమోదు చేసుకోవడానికి 15వ తేదీ చివరి గడువు.

Updated Date - 2021-12-15T08:40:05+05:30 IST