పెట్రోల్ బంకుల్లో కళ్ల ముందే మాయ.. తెలిస్తే షాకే..!

ABN , First Publish Date - 2021-10-07T23:14:16+05:30 IST

బాలానగర్‌లో పెట్రోల్ బంకుల్లో భారీ మోసం వెలుగు చూసింది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ రేట్లతో వాహనదారులు అల్లాడిపోతుంటే..

పెట్రోల్ బంకుల్లో కళ్ల ముందే మాయ.. తెలిస్తే షాకే..!

హైదరాబాద్: బాలానగర్‌లో పెట్రోల్ బంకుల్లో భారీ మోసం వెలుగు చూసింది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ రేట్లతో వాహనదారులు అల్లాడిపోతుంటే బంకుల యజమానులు అడ్డంగా దోచేస్తున్నారు. మైక్రో చిప్పులు అమర్చి దోపిడీ చేస్తున్నారు. లీటర్ పెట్రోల్ కొట్టిస్తే ముప్పావ్ లీటర్ మాత్రమే వాహనదారులకు వస్తోంది. మిగతా పావు లీటర్ పెట్రోల్‌ను బంకులు కొట్టేస్తున్నాయి. వాహనదారుల కళ్ల ముందే మాయ చేస్తున్నారు. వాహనదారుల కళ్ల ముందే మాయ చేస్తున్నారు. ఇటీవల వాహనదారుల ఫిర్యాదులతో పెట్రో బంకుల మోసాలపై పోలీసులు నిఘా పెట్టారు. మైక్రో చిప్‌లతో మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. 
Updated Date - 2021-10-07T23:14:16+05:30 IST