పెట్రోల్ బంకులు 24 గంటలూ లాక్‌డౌన్ నుంచి
ABN , First Publish Date - 2021-05-20T08:27:34+05:30 IST
ధాన్యం తరలించే వాహనాలతోపాటు అత్యవసర వాహనాలకు ఇంధన కొరత తలెత్తున్న నేపథ్యంలో పెట్రోల్ బంకులను 24 గంటలపాటు నడిపించేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మినహాయింపు ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): ధాన్యం తరలించే వాహనాలతోపాటు అత్యవసర వాహనాలకు ఇంధన కొరత తలెత్తున్న నేపథ్యంలో పెట్రోల్ బంకులను 24 గంటలపాటు నడిపించేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. లాక్‌డౌన్‌తో పెట్రోల్ బంకులు ఉదయం 6నుంచి 10 గంటల వరకే నడవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే జిల్లాల్లో ధాన్యం సేకరణ జరుగుతుండటంతోపాటు అంబులెన్స్‌లకు ఇంధన కొరత తలెత్తున్న నేపథ్యంలో పెట్రోల్ బంకులు యథాతథంగా 24గంటలపాటు నడుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.