రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-12-31T15:20:45+05:30 IST
శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఒక ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..

రంగారెడ్డి : శంషాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఒక ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న డీసీఎం డివైడర్‌ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో ఘటనలో గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వస్తున్న లారీ టైర్ బ్లాస్ట్ కావడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.