శంషాబాద్ ఎయిర్ పోర్టులో వ్యక్తి అరెస్ట్

ABN , First Publish Date - 2021-10-25T18:21:24+05:30 IST

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలియా భాను అనే వ్యక్తిని సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆలియా భాను

శంషాబాద్ ఎయిర్ పోర్టులో వ్యక్తి అరెస్ట్

శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలియా భాను అనే వ్యక్తిని సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆలియా భాను అనే వ్యక్తి వద్ద నుంచి రూ.10 లక్షలకు పైగా విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి EY-275 విమానంలో నిందితుడు వచ్చాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అతని బ్యాగ్‌ను సీఐఎస్ఎఫ్ సెక్యూరిటి ఆధికారులు చెకింగ్ చేశారు. బ్యాగులో 10 లక్షలకు పైగా సౌది రియాల్స్‌ను గుర్తించారు. సీఐఎస్ఎఫ్ సెక్యూరిటి ఆధికారులు కరెన్సీని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

Updated Date - 2021-10-25T18:21:24+05:30 IST