ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న పెద్దపులి సంచారం
ABN , First Publish Date - 2021-05-05T14:37:07+05:30 IST
కొమురంభీం : పెద్దపులి సంచారం కొమురంభీం జిల్లాలోని కొన్ని మండలాలకు చెందిన ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

కొమురంభీం : పెద్దపులి సంచారం కొమురంభీం జిల్లాలోని కొన్ని మండలాలకు చెందిన ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. దహెగాం మండలం, దిగిడ- పెంచికల్ పేట మండలాల పరిధిలోని కమ్మర్ గాం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోంది. పశువుల మందలపై దాడి చేస్తోంది, పులి దాడిలో ఇప్పటికే ఒక ఆవు, మరో ఎద్దు మృతి చెందాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.