కరోనా సోకిందని బస్సు టైర్ల కింద తలపెట్టిన యువకుడు

ABN , First Publish Date - 2021-05-02T17:08:36+05:30 IST

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు రాష్ట్రంలో పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో కూడా కరోనా మహమ్మారి

కరోనా సోకిందని బస్సు టైర్ల కింద తలపెట్టిన యువకుడు

పెద్దపల్లి: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు  రాష్ట్రంలో పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో కూడా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న యువకుడు కరోనా వచ్చిందనే అనుమానం తన ప్రాణాల మీదకి తీసుకువచ్చింది. కరోనా సోకిందనే తన భయంతోనే బస్సు టైర్ల కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రామగుండం కార్పొరేషన్ రాజీవ్ రహదారిపై ఈ ఘటన జరిగింది.

Updated Date - 2021-05-02T17:08:36+05:30 IST