రేపు ఖమ్మంలో పీసీసీ సమావేశం
ABN , First Publish Date - 2021-02-06T09:39:29+05:30 IST
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటు పలు మునిసిపాలిటీలకు జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని

ఖమ్మం/హైదరాబాద్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటు పలు మునిసిపాలిటీలకు జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులతో ఖమ్మంలో ఆదివారం టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు బూత్‌స్థాయి కమిటీల కర్తవ్యం, కార్పొరేషన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇన్‌చార్జ్‌ల నియామకం తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి, పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. కాగా, ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా శనివారం దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై రైతు సంఘాలు తలపెట్టిన రాస్తారోకోల్లో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.