షర్మిల కొత్త పార్టీపై పవన్ స్పందన

ABN , First Publish Date - 2021-07-08T17:47:34+05:30 IST

తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు.

షర్మిల కొత్త పార్టీపై  పవన్ స్పందన

హైదరాబాద్: తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. కొత్తపార్టీ ఎవరు పెట్టినా స్వాగతిస్తామని అన్నారు. కొత్తపార్టీలు రావాలని, ఆ పార్టీలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణలో జనసేన పార్టీ ఎలా ఉండబోతోందన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా.. జనసేన ఇవాళ కొత్తగా వచ్చిందికాదన్నారు. 2007 నుంచి తాను రాజకీయంలో ఉన్నానన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉన్న నేలని, ఇలాంటి నేలలో కొత్త రక్తం, చైతన్యంతో కూడుకున్న యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. అలాంటి వారిని జనసేన గుర్తించి.. ప్రోత్సాహం ఇస్తుందన్నారు.


పార్టీ నిర్మాణం చాలా కష్టసాధ్యమైనదని పవన్ కల్యాణ్ అన్నారు. తను పగటి కలలు కనే వ్యక్తిని కాదన్నారు. కుటుంబ వారసత్వ రాజకీయం ఉన్నవాళ్లే కాకుండా ఇతరులు కూడా రాజకీయాల్లోకి రావాలని జనసేనాని ఆకాంక్షించారు.

Updated Date - 2021-07-08T17:47:34+05:30 IST