లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన పటాన్‌చెరు పీఎఫ్‌ కార్యాలయ ఉద్యోగి

ABN , First Publish Date - 2021-01-20T09:08:13+05:30 IST

పటాన్‌చెరు పీఎఫ్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన పటాన్‌చెరు పీఎఫ్‌ కార్యాలయ ఉద్యోగి

పటాన్‌చెరు, జనవరి 19: పటాన్‌చెరు పీఎఫ్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. పీఎఫ్‌ కార్యాలయ సోషల్‌ సెక్యురిటీ ఆడిట్‌ విభాగంలో పనిచేసే సీనియర్‌ అసిస్టెంట్‌ భరత్‌రెడ్డి.. పని నిమిత్తం ఓ ఖాతాదారుడి నుంచి రూ.10 వేలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఖాతాదారుడు రెండు విడతలుగా రూ.4 వేలు గుగుల్‌పే ద్వారా, రూ.3 వేలు నగదు రూపంలో అందజేశాడు. పని పూర్తికాకపోవడంతో విసిగిపోయిన ఖాతాదారుడు సీబీఐకి ఫిర్యాదు చేశాడు. అధికారుల సూచన మేరకు సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఖాతాదారుడు మరో రూ. 3వేలను భరత్‌రెడ్డికి కార్యాలయంలోనే అందజేశాడు. అప్పటికే కార్యాలయం బయట సిద్ధంగా ఉన్న ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు రంగప్రవేశం చేసి, భరత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి తరలించారు.  

Updated Date - 2021-01-20T09:08:13+05:30 IST